బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ కేవలం 13 రోజుల్లోనే దేశ వ్యాప్తంగా 500 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది.దాంతో ఈఏడాది ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది.నిన్న ఒక్క రోజే ఈసినిమా 23.70 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఓవరాల్ గా చూస్తుంటే 15 రోజుల్లో ఈసినిమా 700కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. దాంతోకాంతరా చాప్టర్ 1, ఛావా తరువాత ఈ ఫీట్ సాధించిన ఈ ఏడాది మూడో సినిమాగా ధురంధర్ ననిలిచింది.దురంధుర్ దూకుడు చూస్తుంటే వచ్చే వారంలో ఈరెండు సినిమాలను దాటేసి ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించనుంది.అంతేకాదు ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు.ఒక్క నార్త్ అమెరికాలోనే ఈసినిమా ఇప్పటివరకు 10 మిలియన్ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.
దర్శకుడు ఆదిత్య ధార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్ మరియు అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడమే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలో వేగంగా రూ. 500 కోట్లు వసూలు చేసిన చిత్రాలలో ఒకటిగా రికార్డు కెక్కింది.స్పై జానర్‌లో వచ్చిన ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.త్వరలోనే ఈసినిమా తెలుగులోనూ విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























