కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్‌గా నిలిచి అంచనాలను పెంచేశాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ రోజు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ విషయానికి వస్తే సంక్రాంతి బరిలో వున్న సినిమాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి మిగితా సినిమాల కన్నా ముందు వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాను రవితేజ డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈరోజు విడుదలైన ఈసినిమా టీజర్ ఎంటర్టైనింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది. రవితేజ రొటీన్ స్టయిల్ కు భిన్నంగా రిఫ్రెషింగ్ కంటెంట్ తో వస్తున్నాడు.టీజర్ లో ఎంటర్టైన్మెంట్ తోపాటు క్వాలిటీ విజువల్స్ హైలైట్ అయ్యాయి.టీజర్ అయితే ప్రామిసింగ్ గా ఉండి సినిమా షూర్ షాట్ హిట్ అనే టాక్ తెచ్చుకుంటుంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయడానికి ఈ చిత్రం ముస్తాబవుతోంది.ఇక రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.జనవరి 13న ఈసినిమా థియేటర్లోకి రానుంది. అయితే పండుగ బరిలో మరికొన్ని సినిమాలు కూడా వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.ఇక ఈసినిమాతో రవితేజ కం బ్యాక్ ఇచ్చాలనే వున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























