నెట్ ఫ్లిక్స్ లోకి లిటిల్ హార్ట్స్

Blockbuster Little Hearts Arrives on Netflix Too in Multiple Languages

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ‘లిటిల్ హార్ట్స్. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో ఏకంగా 35 కోట్ల వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే సినిమా చూసిన ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి కంటెంట్ పై నమ్మకంతో థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారు.వారి నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ చిత్రం మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి, యువ హీరోయిన్ శివాని నాగరం జంటగా నటించిన ఈ సినిమాను సాయి మార్తాండ్ తెరకెక్కించగా, సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించారు. ఈటీవీ విన్ తో కలిసి #90s వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.థియేటర్లలో 2 గంటల 5 నిమిషాలు ఉన్న ఈ సినిమా, ఓటీటీలో మాత్రం ‘ఎక్స్‌టెండెడ్ కట్’ వెర్షన్ తో వచ్చింది.

అయితే ఈటీవీ విన్ కేవలం ఒరిజినల్ వెర్షన్ లో మాత్రమే విడుదలచేయగా లీడింగ్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు ఈసినిమాను మిగితా భాషల్లో కూడా డబ్ చేసి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. ఈరోజు నుండి ఈసినిమా తెలుగు తోపాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. అలా లిటిల్ హార్ట్స్ ఇప్పుడు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.