జన నాయగన్ సెకండ్ సింగిల్ రిలీజ్ 

Jana Nayagan Second Single Released

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన సినీ ప్రస్థానంలో ఆఖరి చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం  ‘జన నాయగన్’.  తెలుగులో ఈసినిమా జన నాయకుడు గ విడుదలకానుంది.  ఈసినిమా  పై అంచనాలు భారీగా వున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ వరుస అప్‌డేట్లతో అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ఇటీవలే విడుదలైన మొదటి పాట ‘దళపతి కచేరి’ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించి చార్ట్‌బస్టర్‌గా నిలవగా, ఇప్పుడు రెండో పాట  కూడా విడుదలైంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతంలో  పవర్‌ఫుల్ ఎలివేషన్ సాంగ్‌గా వచ్చిన ఈ పాట కూడా చార్ట్  బస్టర్ అనేలా వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఖాకి’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన హెచ్. వినోత్ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, నరైన్, ప్రియమణి మరియు మమితా బైజు వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

అయితే ఈ ఏడాది సంక్రాంతి బరిలో తెలుగు నుండి భారీ బడ్జెట్ మరియు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. దీంతో తెలుగు బాక్సాఫీస్ వద్ద విజయ్ చిత్రానికి గట్టి పోటీ ఎదురుకానుంది.అయినప్పటికీ, దళపతి విజయ్ క్రేజ్ మరియు సినిమాలోని మాస్ ఎలిమెంట్స్ ఈ పోటీని తట్టుకుని నిలబడతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా విజయ్ సినీ కెరీర్‌కు ఒక ఘనమైన ముగింపుని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.