రౌడీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ .. విజయ్ నెక్స్ట్ మూవీ టైటిల్ గ్లింప్స్ డేట్ ఫిక్స్

Good News for Rowdy Fans Vijay’s Next Movie Title Glimpse Date Locked

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ ‘SVC 59′(వర్కింగ్ టైటిల్). రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు విజయ్ అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఇందులో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ పెరిగింది. ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ ప్రచారంలో వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఇందుకోసం కేవలం టైటిల్ ను మాత్రమే కాకుండా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.ఈనెల 22న రాత్రి 7:29 గంటలకు ఈ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ కానుంది.ఈ గ్లింప్స్ లో ఎలాంటి కథను చెప్పబోతున్నారో రివీల్ చేయనున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో ( డైరెక్టర్ వెర్షన్) రిలీజ్ చేశారు.

ఈ చిత్రం పూర్తిస్థాయి మాస్ మరియు రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. విజయ్ దేవరకొండ తన గత చిత్రాలకు భిన్నంగా ఇందులో ఒక సరికొత్త మాస్ మేకోవర్‌లో కనిపించబోతున్నారు. దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ కథను ఎంతో పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారని, అందుకే ఈ గ్లింప్స్ ద్వారానే సినిమా స్థాయిని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ గ్లింప్స్ విడుదలతో సినిమాపై ఉన్న హైప్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక విజయ్ ఈసినిమా కాకుండా మరో సినిమా కూడా చేస్తున్నాడు. అందులో భాగంగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో VD 14(వర్కింగ్ టైటిల్ ) సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.త్వరలోనే ఈసినిమా నుండి కూడా అప్డేట్ రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.