నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2: తాండవం కేవలం మాస్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా , కుటుంబ ప్రేక్షకులను కూడా బలంగా ఆకర్షిస్తోంది.బోయపాటి శ్రీను సినిమాలలో మాస్ ఎలివేషన్స్‌తో పాటు, బలమైన కుటుంబ బంధాలు, విలువలు, మరియు ఎమోషన్స్ తప్పక ఉంటాయి. అఖండ 2 లో కూడా ఈ అంశాలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. రిపీట్ లో ఈసినిమాను చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి భాగమైన అఖండలో కూడా అఘోరా పాత్ర ద్వారా దర్శకుడు ఒక సామాజిక సందేశాన్ని బలంగా వినిపించారు. రెండో భాగంలోనూ అదే తరహాలో కుటుంబ విలువలు, మంచి-చెడుల మధ్య పోరాటం వంటి అంశాలు హైలైట్ కావడంతో, తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కేవలం మాస్ సెంటర్‌లలోనే కాక, ఫ్యామిలీ ఆడియన్స్ అధికంగా ఉండే ఏరియాలలో కూడా ఈ సినిమాకు మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది.ఇది అఖండ 2 కి మరింత అడ్వాటేంజ్ అయ్యింది. దాంతో కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది.అఖండ 2 మాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ అనే రెండు వర్గాల ప్రేక్షకుల ఆదరణను పొందుతుండడంతో సాలిడ్ లాంగ్ రన్ ను కొనసాగించనుంది.
ఈసినిమాలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో నటించగా సంయుక్త మీనన్ , హర్షాలి మల్హోత్రా ,ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించిన ఈసినిమాకు థమన్ సంగీతం అందించగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట ,గోపీ ఆచంట నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























