అఖండ 2 రిలీజ్ డేట్ మారడం తో ఈనెల 12న రావాల్సిన సినిమాలు ఒక్క కార్తీ అన్నగారు వస్తారు తప్ప మిగితావి వాయిదా పడ్డాయి. అందులో సైక్ సిద్దార్థ జనవరి 1కి వాయిదా వేసుకోగా హారర్ థ్రిల్లర్ ఈశా కూడా డేట్ మార్చుకుంది. ఈసినిమా 12న రిలీజ్ కావాల్సివుండగా ఇప్పుడు అదే డేట్ కు అఖండ 2 వస్తుండడం తో వెనక్కి వెళ్ళిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనెల 25 ఈషా థియేటర్లోకి రానుందని మేకర్స్ ప్రకటించారు.ట్రైలర్ తో ఈసినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.ట్రైలర్ బయటపెట్టే సన్నివేశాలతో ఆసక్తికరంగా ఉండడం తో హారర్ థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఈషా కోసంఎదురుచూస్తున్నారు.ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఇందులో రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటించగా హెబ్బాపటేల్ కథానాయికగా చేసింది. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రెగ్యులర్ హారర్ ఫార్ములాకు భిన్నంగా రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























