కోలీవుడ్ సెన్సేషనల్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) రిలీజ్ మరోసారి వాయిదాపడనుంది.ముందు ఈసినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.అయితే పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవ్వడం వల్ల వాయిదా వేశారు.ఆ తరువాత దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న రిలీజ్ కానుందని అనౌన్స్ చేశారు.కానీ డ్యూడ్ వల్ల ఆ డేట్ కూడా మిస్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాంతో డిసెంబర్ 18న రిలీజ్ చేస్తామని రీసెంట్ గా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆ డేట్ కూడా మిస్ కానుందని సమాచారం. అయితే వాయిదా పడడానికి కారణాలు తెలియాల్సి వుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా ఆపేశారు.ఒకటి రెండు రోజుల్లో మేకర్స్ నుండి రిలీజ్ విషయంలో అధికారిక ప్రకటన రానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈసినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ వుంది.విగ్నేష్ శివన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
ఇక రీసెంట్ గా ప్రదీప్ డ్యూడ్ తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా అన్ని భాషల్లో కలిపి 100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. ఈ ఏడాది ప్రదీప్ కి ఇది సెకండ్ రిలీజ్. సమ్మర్ లో డ్రాగన్ తో బ్లాక్ బస్టర్ కొట్టగా దీపావళికి డ్యూడ్ తో వరుసగా మూడో సారి 100కోట్ల క్లబ్ లో చేరాడు. అలా హీరోగా చేసిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరి ప్రదీప్ కి ఎల్ఐకె ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























