ప్రేమకథా చిత్రాలలో ఆల్ టైం కల్ట్ క్లాసిక్ గా నిలిచిన హిందీ సినిమా దిల్వాలే దుల్హనియా లేజాయేంగే (డీడీఎల్జే) మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 20, 1995న విడుదలైంది. ఈ సినిమాకు 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, సినిమాలోని రాజ్ (షారుఖ్) మరియు సిమ్రాన్ (కాజోల్) యొక్క ఐకానిక్ పోజులో ఉన్న కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లండన్లోని లీసెస్టర్ స్క్వేర్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను షారుఖ్ ఖాన్ మరియు కాజోల్ గురువారం ఆవిష్కరించారు. ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’ అనే ప్రదర్శనలో స్థానం సంపాదించిన తొలి భారతీయ సినిమాగా డీడీఎల్జే రికార్డు సృష్టించింది. గతంలో ‘హ్యారీ పోటర్’, ‘మేరీ పాపిన్స్’ వంటి కొన్ని హాలీవుడ్ చిత్రాల విగ్రహాలు మాత్రమే ఇక్కడ కొలువుదీరాయి.
విగ్రహావిష్కరణ అనంతరం షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. డీడీఎల్జే తనకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. ఈ సినిమా ప్రేమ, అడ్డంకులు మరియు ప్రపంచంలో ప్రేమ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో తీసినట్లు గుర్తుచేసుకున్నారు. 30 ఏళ్లు గడిచినా ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదని కాజోల్ ఆనందం వ్యక్తం చేసింది. భారతీయ చిత్ర పరిశ్రమలో థియేటర్లలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా డీడీఎల్జే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























