సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ సీక్వెల్ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఫస్ట్ పార్ట్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పవర్ ఫుల్ క్యామియో పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ లోను వీరు భాగం కానున్నారు. ఇక వీరు మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ సీక్వెల్‌లో మరో క్రేజీ యాక్టర్ తీసుకున్నారని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారని సమాచారం.విజయ్ సేతుపతికి తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ఉంది.అయితే ఈ క్యారెక్టర్ టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ చేయాల్సిందట. కానీ కుదరకపోవడంతో విజయ్ సేతుపతిని తీసుకున్నారని కోలీవుడ్ మీడియా కథనం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జైలర్ 2 ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటుండగా, ఈ షెడ్యూల్‌లోనే విజయ్ సేతుపతిపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్.రజినీకాంత్, విజయ్ సేతుపతి కాంబో గతంలో ‘పేట’ సినిమాలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
జైలర్ 2ను 2026 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు రజినీకాంత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ నటి విద్యాబాలన్ తోఆ పాటు ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























