వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం ’16 రోజుల పండగ’. సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్ పై ప్రొడక్షన్ నెం-1గా సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు ఈ చిత్రం పూజాకార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి కోన వెంకట్, కేకే రాధా మోహన్ నిర్మాతలకి స్క్రిప్ట్ అందించారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల క్లాప్ కొట్టారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ కు డి సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు అల్లు అరవింద్ గారు, మైత్రి రవి గారు దామోదర ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి హాజరై టీం కి అభినందనలు తెలిపారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. పి కళ్యాణి సునీల్ డీవోపీ, సూర్య తేజ లంక ఎడిటర్. డైరెక్టర్ సాయికిరణ్ అడివి తో కలసి మల్లి అంకం, సోమ శేఖర్ పొక్కళ్ల, శ్రీరామ్ మన్నార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























