కల్ట్ అమృతం సీరియల్ మళ్ళీ వస్తుంది

Iconic Amrutham Serial Returns Once Again

‘ఒరేయ్ ఆంజనేలూ..! తెగ ఆయాస పడిపోకు చాలు.. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ ను వినని 90s కిడ్స్ వుండరు. ఇది అమృతం సీరియల్ సాంగ్. ఈ సీరియల్ 90s కిడ్స్‌తో సహా ఎంతోమందికి అత్యంత ఇష్టమైనది.అమృతం అప్పట్లో బుల్లితెర మీద సంచలనం సృష్టించింది. ఇక ఈ సీరియల్‌ను ఇప్పుడు యూట్యూబ్ లో వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీమాస్టర్డ్ ఆడియో మరియు వీడియో క్వాలిటీతో ప్రేక్షకులకు అందిస్తున్నారు.అమృతం సీరియల్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఇది అందుబాటులోకి వస్తుంది. నవంబర్ 24వ తేదీ నుంచి ఈ ఎపిసోడ్‌లను విడుదల చేయడం ప్రారంభించారు.ప్రతి రోజూ రెండు ఎపిసోడ్ ల చొప్పున ఉదయం 11 గంటలకు అలాగే సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్‌లో విడుదలవుతాయి.ఇప్పటికే విడుదలైన ఎపిసోడ్స్ కి ప్రేక్షకులను నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.

ఈ సీరియల్‌లో టైటిల్ పాత్రలో అమృతరావుగా మొదట్లో శివాజీ రాజా నటించగా ఆ తర్వాత నరేశ్, అనంతరం హర్షవర్ధన్ నటించి ప్రేక్షకులను నవ్వించారు.అలాగే గుండు హనుమంతురావు,రాగిణి,శివన్నారాయణ ,వాసు ఇంటూరి , జాన్సీ వంటి నటులు సహాయ పాత్రలతో ఆకట్టుకున్నారు.ఇక ఇప్పుడు అమృతం మళ్ళీ వస్తుండడంతో ఆ నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.