ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఈరోజు తన నివాసంలో కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరి, 12 రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన కొద్ది రోజులకే ఆయన ముంబైలోని తన నివాసంలో 89 ఏళ్ల వయసులో నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన 90వ జన్మదినానికి కొద్ది వారాల ముందు ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాగా, ధర్మేంద్ర డిసెంబర్ 8న 90వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవాల్సి ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధర్మేంద్ర 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించారు.1960ల్లో అన్పాద్, బందిని, అనుపమ వంటి చిత్రాల్లో సాధారణ వ్యక్తి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఆ తర్వాత ఆయన షోలే, ధరమ్ వీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దేశ్, డ్రీమ్ గర్ల్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి ‘హీ-మ్యాన్’గా గుర్తింపు పొందారు. ఆయన చివరిసారిగా షాహిద్ కపూర్, కృతి సనన్ నటించిన ‘తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా’ చిత్రంలో కనిపించారు. ఆయన చివరగా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద నటించిన ‘ఇక్కిస్’ లో నటించారు. ఇది డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది.
ఇక ధర్మేంద్ర మరణ వార్తతో బాలీవుడ్ పరిశ్రమలో మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ముంబైలోని ఆయన నివాసం వద్ద అంబులెన్సులు, భద్రత పెరిగినట్లు సమాచారం.దేశీయ సినిమాకు ఆయన చేసిన సేవలు, విభిన్న పాత్రలు, ఆరు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని సినీ ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























