తమిళ హీరో కార్తీ వా వాతియార్ రీసెంట్ గానే రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది.నిజానికి ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమాకు మధ్యలో అనేక అడ్డంకులు వచ్చాయి. దాంతో షూటింగ్ పూర్తి కావడం ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక మేకర్స్ ఇటీవలే రిలీజ్ డేట్ ను ప్రకటించారు.డిసెంబర్ 5న వా వాతియార్ థియేటర్లోకి రానుందని చెప్పేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు ఆ డేట్ కి కూడా రావడం అనుమానంగా మారింది. షూటింగ్ పూర్తి కాకపోవడమే అందుకు కారణం.ప్రస్తుతం ప్యాచ్ వర్క్ షూట్ కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఓ వారం రోజులు పట్టొచ్చు. దాంతో అనుకున్న తేదీకి సినిమా రెడీ అయ్యే ఛాన్స్ లేకపోవడంతో రిలీజ్ డేట్ మార్చాలని అనుకుంటున్నారట. ఒక వారం రోజులు ఆలస్యంగా డిసెంబర్ 12న రిలీజ్ కానుందని కోలీవుడ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.అయితే ఈ రిలీజ్ డేట్ పై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సివుంది.
నలన్ కుమారస్వామి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా స్టూడియో గ్రీన్ నిర్మిస్తుంది. ఇక ఈసినిమా కన్నా ముందే కార్తీ ,సర్దార్ 2 కూడా ఫినిష్ చేశాడు.ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























