12A రైల్వే కాలనీ సెకండ్ సింగిల్ రిలీజ్

Second Single from 12A Railway Colony Released

బచ్చలమల్లి తరువాత హీరో అల్లరి నరేష్ నటించిన సినిమా 12ఏ రైల్వే కాలనీ.హారర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది .పొలిమేర, పొలిమేర 2 ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఈసినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా ఈ చిత్రాన్నిప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. నవంబర్ 21న 12A రైల్వే కాలనీ థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.కన్నొదిలి కలవొదిలి అంటూ వచ్చిన ఈ సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తరువాత కొద్దీ రోజుల క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.ఇక ఈరోజు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. బ్రేకప్ అంతేమ్ గుండె గుడిలో అంటూ వచ్చిన ఈసాంగ్ కూడా బాగానే వుంది. దేవ్ పవార్ లిరిక్స్ అందించగా కపిల్ కపిలాన్ పాడారు.

నాని కసరగడ్డ ఈసినిమాను చేస్తుండగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.