SSMB 29 నుండి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్

Priyanka Chopra’s First Look from SSMB 29 Unveiled

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘SSMB 29’ నుండి వరుసగా సర్‌ప్రైజ్‌లు వస్తున్నాయి. ఇప్పటికే విలన్ పాత్ర ‘కుంభ’ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఫస్ట్ లుక్ మరియు ‘సంచారి’ థీమ్ సాంగ్ విడుదల కాగా, తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె చీరకట్టులో, హీల్స్ ధరించి, చేతిలో పిస్టల్‌తో ఎంతో డైనమిక్‌గా, యాక్షన్ మోడ్‌లో దర్శనమిచ్చింది. సాంప్రదాయ దుస్తుల్లో ఉండి,యాక్షన్ చేస్తూ కనిపించడం ఆమె పాత్రలో ఏదో బలమైన ట్విస్ట్ ఉందని సూచిస్తోంది.ఇక నెక్స్ట్ ఈసినిమా నుండి మహేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ కావాల్సివుంది. మరి అది ఈరెండు రోజుల్లో రిలీజ్ చేస్తారా లేక డైరెక్ట్ గా ఈవెంట్ లోనే వదులుతారో చూడాలి.

నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌పై అంచనాలను భారీగా వున్నాయి.ఈ ఈవెంట్‌లో గ్లింప్స్‌తో పాటు, సినిమా అధికారిక టైటిల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది.జియో హాట్ స్టార్ లో ఈవెంట్ ప్రత్యక్షప్రసారం కానుంది.ఈ గ్లోబ్ ట్రాటర్ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2027 లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.