యంగ్ హీరో విశ్వక్ సేన్ – డైరెక్టర్ అనుదీప్ కెవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫంకీ.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి. రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అనుదీప్ మార్క్ కామెడీ తో వచ్చిన ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈసినిమాలో విశ్వక్ సేన్ డైరెక్టర్ గా నటిస్తుండగా హీరోయిన్ కయదు లోహర్ నిర్మాత రోల్ లో కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్స్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తారన్నట్లు రీసెంట్ గా వార్తలు వచ్చాయి అయితే అవ్వని రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఈరోజు ఈసినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 3న ఫంకీ థియేటర్లలోకి రానుంది.
ఫన్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.ఇక వరుస పరాజయాలతో రేస్ లో వెనకబడ్డ విశ్వక్ సేన్, ఫంకీ తో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























