మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచమైన చిత్రం ఫీనిక్స్. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించారు. ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజలక్ష్మి ‘అన్ల్’ అరసు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే తమిళ్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తెలుగులో నవంబర్ 7 రిలీజ్ కానుంది. ఈ సందర్భం మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన గోపీచంద్ గారికి థాంక్యూ. ఆయన చెప్పిన మాటలు మాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. నేను జవాన్ సినిమా చేస్తున్నప్పుడు అనల్ అరసు మాస్టర్ గారిని కలిసాను. అప్పుడు ఈ కథ చెప్పారు. మా అబ్బాయి ఇందులో నటించాలని అన్నారు. మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పాను. ఆ తర్వాత నాకు ఏమీ తెలియదు. వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. సినిమా చేశారు. నేను సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. ఇది మా అబ్బాయికి చాలా మంచి ఆరంభం. ఒక తండ్రిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. తనకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమా చేయాలని ఉండేది. తనకి యాక్షన్ చాలా ఇష్టం. నన్ను యాక్షన్ సినిమాలు చేయమని చెప్తుండేవాడు. తనకి మాస్ యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. యాక్షన్ సినిమాని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాడు. అలాంటి సినిమాలు చేయడం తన కల.
ఒకరోజు తను యాక్టర్ కావాలి అని చెప్పాడు. అలా చెప్పిన ఏడాదిలోనే సినిమా చేశాడు. అదంతా డైరెక్టర్ అనల్ అరసు మాస్టర్, నిర్మాత రాజ్యలక్ష్మి మేడం గారి వలన సాధ్యపడింది. ఈ సినిమాకి తెలుగులో డైలాగ్స్ రాసిన భాష్యశ్రీ గారికి థాంక్యూ. నేను ప్రస్తుతం పూరి గారి సినిమా చేస్తున్నాను. ఆ సినిమా పూర్తయ్యేలోగా తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడుతాను. కవితలు కూడా రాస్తాను( నవ్వుతూ). అప్పటివరకు కొంచెం నా తెలుగులో అడ్జస్ట్ అవ్వండి(నవ్వుతూ) వరలక్ష్మి గారు నేను చాలా మంచి ఫ్రెండ్స్ . తనకి చాలా హై ఎనర్జీ ఉంటుంది. సినిమాకి సినిమా ఏ భాషలో ఉన్న అందులో ఎమోషన్ కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరూ సినిమాని సెలబ్రేట్ చేస్తారు. అందుకే మనం అన్ని భాషలు సినిమాలు చూస్తాం. ఫినిక్స్ విషయంలో కూడా అది జరుగుతుంది. ఇందులో యాక్షన్ ఎమోషన్ అన్ని చాలా అద్భుతంగా కుదిరాయి. తప్పకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. నవంబర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. అందరం థియేటర్స్ లో కలుద్దాం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























