మదరాసి తర్వాత తమిళ నటుడు శివ కార్తికేయన్ నుండి రాబోతున్న తదుపరి సినిమా పరాశక్తి .ఇది శివ కార్తికేయన్‌కు 25వ కావడం విశేషం.ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అథర్వ, శ్రీలీల, రవి మోహన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలీల కు తమిళ్ లో ఇదే మొదటి సినిమాఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ పాట ఈ వారం విడుదల కానుంది.ఈనేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటలకు ఫస్ట్ సింగిల్ ప్రోమో ను రిలీజ్ చేయనున్నారు. జివి ప్రకాష్ కుమార్ కు ఇది 100వ సినిమా కావడంతో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు.
పరాశక్తి 1990 బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జనవరి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే, పొంగల్ కి దళపతి విజయ్ నటించిన జన నాయగన్ కూడా విడుదల కానుండడంతో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు జరగనుంది.అలాగే తెలుగులో సంక్రాంతికి పెద్ది సినిమాలు వస్తుండడంతో పరాశక్తి కి భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

























