యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు-ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘SSMB 29’ నుండి మహేష్ బర్త్ డే రోజున నవంబర్ లో పక్కా అప్డేట్ ఇస్తామని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ రావడంతో ఫ్యాన్స్ యాక్టీవ్ అయిపోయారు. రాజమౌళి చెప్పినట్లు గానే అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది టీం. అందులో భాగంగా ఈసినిమా ప్రమోషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు. ఈనెల 15న రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ లో భారీ తెరను ఏర్పరిచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఫ్యాన్స్ ను ఈ ఈవెంట్ ఆహ్వానించనున్నారు. అలాగే ఈవెంట్ ను జియో హాట్ స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అందుకు సంబంధించిన డీల్ కూడా క్లోజ్ అయ్యింది. సినిమా చరిత్రలో ఇంకా షూటింగ్ కూడా సరిగ్గా స్టార్ట్ కానీ సినిమా ఈవెంట్ ను ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ చేయనుండడం ఇదే మొదటి సారి.ఈ ఈవెంట్ లో ఫస్ట్ లుక్ గ్లింప్స్ తోపాటు టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. అదే రోజు సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు శనివారం అర్థరాత్రి నుండి ఎస్ఎస్ఎంబీ 29 టీం ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. నవంబర్‌లో అప్‌డేట్ ఇస్తామని చెప్పిన టీమ్, సినిమా గురించి కాకుండా అప్‌డేట్ గురించి అప్‌డేట్ ఇచ్చి ఎక్స్ లో హంగామా సృష్టించింది.ఈ ఫన్నీ సంభాషణల ద్వారా సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు అనుకోకుండా లీక్ అయ్యాయి.
ట్విటర్‌లో మహేష్, రాజమౌళిల ఆట:నవంబర్ 1వ తేదీ రాత్రి ఆలస్యంగా మహేష్ బాబు ఈ ఆటను మొదలుపెట్టారు. =”ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది, ఇక అప్‌డేట్ ఎప్పుడూ?” అంటూ రాజమౌళిని ట్యాగ్ చేస్తూ మహేష్ ప్రశ్నించారు. దీనికి రాజమౌళి ఫన్నీగా స్పందిస్తూ, “నువ్వు ఏ మూవీకి రివ్యూ ఇస్తున్నావ్ మహేష్?” అని ఆటపట్టిస్తూ, చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి రివీల్ చేద్దామని అన్నారు.
క్యాస్టింగ్ లీక్స్:ఈ సంభాషణలోకి మహేష్ బాబు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను కూడా లాగారు. “మీరు అప్‌డేట్ ఇచ్చేలా లేరు, కానీ మన దేశీ గర్ల్ మాత్రం హైదరాబాద్‌లోని వీధులన్నింటిని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెడుతోంది” అని మహేష్ లీక్ చేశారు. దీనికి ప్రియాంక స్పందిస్తూ, “నువ్వు షూటింగ్ సెట్‌లో చెప్పిన సంగతులన్నీ లీక్ చేయమంటావా?” అని కౌంటర్ వేయడంతో, రాజమౌళి “నువ్వు అంతా నాశనం చేస్తున్నావ్ ప్రియాంక, సర్ప్రైజ్ అనుకున్నాం కదా” అని స్పందించారు.ఇదే సమయంలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ను కూడా ట్యాగ్ చేయడంతో, వీళ్లిద్దరూ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నట్లు అధికారికంగా కన్ఫామ్ అయింది.
విలన్ ఎవరో హింట్:ఈ చర్చలో పృథ్వీరాజ్ సుకుమారన్ జోక్యం చేసుకుంటూ, “మీకు విలన్‌లు అంటే ఇష్టం కదా.. రాజమౌళి” అని ట్యాగ్ చేసి అడగడం ద్వారా, ఆయనే ప్రతినాయక పాత్ర పోషిస్తున్నట్లు ఆడియన్స్‌కు హింట్ ఇచ్చారు. దీనికి ప్రియాంక “బెటర్ లక్ నెక్స్ట్ టైమ్” అని రియాక్ట్ కావడంతో, ఆమె కూడా విలన్ పాత్ర కోసం పోటీ పడుతున్నట్లు అర్థమవుతోంది. (పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా ప్రతినాయక పాత్రలు చేస్తున్నట్లు ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది.)
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























