సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 77వ సినిమా చేయనున్నారని తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమాను అఫీషియల్ గా లాంఛ్ కూడా చేశారు..ఇక ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది.నవంబర్ మొదటి వారం లో షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. వారం రోజులపాటు ఈ ఫస్ట్ షెడ్యూల్ జరుగనుంది.ఈసినిమాను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారు. హిట్ 3 ఫేమ్ శ్రీనిధి శెట్టి ని ఇందులో హీరోయిన్ గా తీసుకోగా యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక వెంకటేష్ ప్రస్తుతం మెగా స్టార్ట్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు లో నటిస్తున్నాడు.ఇందులో వెంకీ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. చిరు – వెంకీ కలిసి నటించడం ఇదే మొదటి సారి. అనిల్ రావిపూడి ఈసినిమాను తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్ , గ్లోడ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.
ఇక వెంకటేష్ తన 77 వ సినిమాతో పాటు దృశ్యం 3 లో కూడా నటించనున్నాడు. ప్రస్తుతం మలయాళ వెర్షన్ షూటింగ్ జరుగుతుంది. అది పూర్తయిన వెంటనే డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు.వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























