బచ్చల మల్లి తరువాత అల్లరి నరేష్ 12ఏ రైల్వే కాలనీ అనే హారర్ థ్రిల్లర్ తో రానున్నాడు.పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఈ ప్రతిష్టాత్మక వెంచర్‌కు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా విడుదల తేదీ ఖరారు చేశారు మేకర్స్.నవంబర్ 21న 12ఏ రైల్వే కాలనీ థియేటర్లలోకి రానుంది. అల్లరి నరేష్ ఇందులో డిఫ్రెంట్ రోల్ లో కనిపించనుండగా పొలిమేర సిరీస్ ఫేమ్ డాక్టర్ కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటించారు.నాని కసరగడ్డ డైరెక్ట్ చేస్తుండగా సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఫీక్ ఫామ్ లో వున్న భీమ్స్ సిసిరోలియో ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇక అల్లరి నరేష్ ప్రస్తుతం మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు. అందులో ఆల్కహాల్ ఒకటి . మెహర్ తేజ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రుహాణి శర్మ , నిహారిక ఎన్ ఎమ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈసినిమా తోపాటు అల్లరి నరేష్ హాస్య మూవీస్ ,అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























