ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

ప్రతి సంవత్సరం అక్టోబరు 23వ తేదీ సినీ అభిమానులకు ఒక పండుగ. ఎందుకంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన ఈ ‘డార్లింగ్’ హీరో ప్రయాణం ఎందరికో ఆదర్శం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కెరీర్ :

2002లో ‘ఈశ్వర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్, ప్రారంభంలో విభిన్న చిత్రాలను ఎంచుకున్నారు. 2004లో ‘వర్షం’ సినిమాతో తొలి బ్లాక్‌బస్టర్‌ను అందుకొని, తన కెరీర్‌కు మలుపు తిప్పారు. 2005లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాతో ప్రభాస్ మాస్ ఇమేజ్ సుస్థిరమైంది. ఆ తర్వాత ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘మిర్చి’ వంటి విజయవంతమైన చిత్రాలతో తనను తాను పరిమితం చేసుకోకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. ‘మిర్చి’ సినిమాకు గాను ప్రభాస్ ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు.

కెరీర్ హైలైట్స్ & ప్రజాదరణ :

ప్రభాస్ కెరీర్ బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అని విభజించవచ్చు.ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ఈ అపురూప దృశ్యకావ్యం కోసం ప్రభాస్ సుమారు ఐదేళ్ల సమయాన్ని కేటాయించడం, సినిమాపై ఆయనకున్న అంకితభావానికి నిదర్శనం. ‘బాహుబలి: ది బిగినింగ్’ (2015), ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ (2017) చిత్రాల విజయంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు. ఈ సినిమా వేల కోట్ల వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. 2017లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడిగా ప్రభాస్ ఘనత సాధించారు.
బాహుబలి తర్వాత ఆయన నటించిన సాహో,ఆది పురుష్, సలార్ చిత్రాలు మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి, ఇది బాక్సాఫీస్ వద్ద ఆయనకున్న తిరుగులేని , ప్రపంచవ్యాప్తంగా ఆయన అపారమైన క్రేజ్ ను తెలియజేస్తుంది.

సినిమా విజయాలతో సంబంధం లేకుండా, ప్రభాస్ వినయం, అజాతశత్రుత్వం, మరియు ఇండస్ట్రీలో అందరినీ ఆప్యాయంగా చూసుకునే ‘కింగ్ సైజ్ హార్ట్’ కారణంగానే అభిమానులు, సహచర నటులు ఆయన్ను ప్రేమతో ‘డార్లింగ్’ అని పిలుస్తారు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’,ఫౌజీ సినిమాలో నటిస్తూ ప్రభాస్ బిజీగా ఉన్నారు.ఇవే కాకుండా స్పిరిట్ ,సలార్ 2, కల్కి 2 చిత్రాలు లైనప్ లో వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.