రెబల్ స్టార్ ప్రభాస్- డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈరోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈసినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను ఖరారు చేశారు.సినిమా అనౌన్స్ మెంట్ నుండే ఈ టైటిల్ ప్రచారంలో ఉండగా మేకర్స్ కూడా అదే ఫైనల్ చేశారు. బ్రిటీష్ పాలనకు ఎదురెళ్ళిన ఓ సైనికుడి కథతో వస్తుంది ఫౌజీ.ఇందులో ప్రభాస్ టైటిల్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్ ప్రీ లుక్ తో కూడిన ఈ టైటిల్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుండగా టి సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు.సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. వచ్చే ఏడాది సమ్మర్ లోగా షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టు 14న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈసినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనుండగా ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది.తనకు ఇదే మొదటి సినిమా.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ అనిల్ విలాస్ జాధవ్ చేపట్టగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























