లక్కీ భాస్కర్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ కాంత తో రానున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. అయితే సినిమాను సెప్టెంబర్ 12నే రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ కుదరకపోవడంతో వాయిదా వేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబర్ 14న కాంత పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది.అలాగే ఈసినిమా ట్రైలర్ కూడా రెడీ గా వుంది.అందుకు సంబంధించిన సెన్సార్ కంప్లీట్ అయిపొయింది. 2 నిమిషాల 53 సెకండ్ల తో ఈ ట్రైలర్ రానుంది.వచ్చే వారం లో ట్రైలర్ ను రిలీజ్ చేసే ఛాన్స్ వుంది. టీజర్ తో సినిమాపై హైప్ క్రియేట్ అవ్వగా ట్రైలర్ ఆ అంచనాలను మరింతగా పెంచనుంది.
ఇదిలావుంటే దుల్కర్ ప్రస్తుతం మరో మూడు సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు. అందులో భాగంగా తెలుగులో ఈ హీరో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.ఇందులో ఆకాశంలో ఒక తార ఒకటి. పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తుండగా సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తుంది.రమ్య గుణ్ణం,సందీప్ గుణ్ణం నిర్మిస్తున్నారు.ఈసినిమాతో పాటు దుల్కర్ లవ్ స్టోరీ నేపథ్యంలో రవి నెలకుడిటి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.ఇవే కాకుండా దుల్కర్ మలయాళంలో ఐయామ్ గేమ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























