రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్ల తో దూసుకుపోతుంది.నిన్నటితో ఈసినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ కలెక్షన్స్ ను దాటేసి ఈ ఏడాది థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.కూలీ ఫుల్ రన్ లో 520 కోట్ల వసూళ్లను రాబట్టగా నిన్నటితో కాంతార 530కోట్ల వసూళ్లను సొంతం చేసుకొంది. ఈ వీకెండ్ కల్లా సైయారా ను బీట్ చేయనుంది.అయితే ఫుల్ రన్ లో ఛావా ను దాటేసి ఈఏడాది హైయిస్ట్ గ్రాసర్ గా రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి.ఛావా ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కాంతార చాప్టర్ 1 కన్నడ లోనే కాదు మిగితా భాషల్లోనూ సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది.హిందిలో నిన్నటి తో 110కోట్ల వసూళ్లను రాబట్టుకోగా తెలుగులో 70 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.మలయాళంలో 40 కోట్ల కుపైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది,తమిళ్ లోకూడా హిట్ దిశగా దూసుకుపోతుంది.అయితే సినిమాకు తెలుగులో ఈవారంలో భారీ పోటీ ఎదురుకానుంది.ఎందుకంటే ఈ దీపావళికి నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.దాంతో కాంతార చాప్టర్ 1 పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
బ్లాక్ బస్టర్ కాంతార కు ప్రీక్వెల్ గా రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























