టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ గారిని అభినందించడానికి చిరంజీవి గారు ఆయన కార్యాలయానికి స్వయంగా వెళ్లారు. ఈ సందర్భంగా చిరు… సజ్జనార్ గారికి పుష్పగుచ్ఛం అందజేసి, నూతన బాధ్యతల్లో పూర్తి విజయం సాధించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా చిరంజీవి గారితో పాటు ఆయన పెద్ద కుమార్తె, నిర్మాత సుష్మిత కొణిదెల కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇరువురూ కాసేపు మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా ముచ్చటించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలోనూ కలిసి పనిచేసిన అనుబంధం
చిరంజీవి, వీసీ సజ్జనార్ గారికి మధ్య మంచి స్నేహబంధం ఉంది. సజ్జనార్ గారు గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇద్దరూ కలిసి కృషి చేశారు.
సుదీర్ఘ కాలం పాటు టీఎస్‌ఆర్టీసీ ఎండీగా పనిచేసిన తర్వాత మళ్లీ పోలీస్ శాఖలోకి తిరిగి వచ్చి, హైదరాబాద్ నగర కొత్వాల్‌గా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్‌ను చిరంజీవి గారు స్వయంగా వెళ్లి అభినందించడం అభిమానులను, సినీ వర్గాలను ఆకట్టుకుంది.
ఇక ఇదిలావుంటే, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ ఇందులో ఒకటి కాగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆధ్వర్యంలో తెరకెక్కుతోన్న ‘మన శంకర వరప్రసాద్’ మరొకటి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























