యంగ్ హీరో విశ్వక్ సేన్ ,జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఫంకీ. సినిమా ఇండస్ట్రీ పై సెటైరికల్ మూవీగా తెరకెక్కుతుంది. ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ టీజర్ హిలేరియస్ గా ఉంది. అనుదీప్ మార్క్ కామెడీ టీజర్ లో హైలైట్ అయ్యింది.ఇందులోని వన్ లైనర్స్ అనుదీప్ గత చిత్రాలు జాతిరత్నాలు , ప్రిన్స్ సినిమాలను గుర్తు చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ లో విశ్వక్ సేన్ పూర్తిగా డిఫరెంట్ ఎనర్జీతో కనిపించాడు. ఒక డైరెక్టర్‌గా, తన కలలను నిజం చేసుకునే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లు, ఫన్నీ సిట్యుయేషన్లుతో కూడిన కథగా ఫంకీ ఉండబోతుందనిపిస్తోంది.ఓవరాల్ గా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఫంకీ లో డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. వచ్చే నెలలో షూట్ కంప్లీట్ చేసి ఫిబ్రవరి లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇక ఈసినిమా విజయం విశ్వక్ సేన్ కు తప్పనిసరి కానుంది. విశ్వక్ నుండి వచ్చిన చివరి మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి నిరాశపరిచాయి.దాంతో ఈసారి విశ్వక్ ఫంకీ తో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























