సూర్య 47 ఎప్పుడు స్టార్ట్ కానుందంటే

Suriya 47 to Begin Soon – Details Inside

తమిళ హీరో సూర్య రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాడు.రీసెంట్ గానే కరుప్పు సినిమాను కంప్లీట్ చేసి ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తన 46వ సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమా కూడా తుది దశకు చేరుకుంది. ఇందులో  సూర్య సరసన ప్రేమలు ఫేమ్ మమితా బైజు నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది వేసవి లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా తరువాత సూర్య నెక్స్ట్ తన 47వ సినిమాను మలయాళ దర్శకుడు, ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్ డైరెక్షన్ లో చేయనున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమాలో సూర్య పోలీస్ రోల్ లో కనిపించనున్నాడట. ప్రస్తుతం ఈసినిమా  కోసం కొచ్చి లో ఓ భారీ సెట్ వేస్తున్నారు.

ఈనెలలో ఈసినిమాను లాంఛ్ చేసి వచ్చే నెలలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇందులో  హీరోయిన్ గా నజ్రియా నజీమ్ ను తీసుకోవాలనుకుంటున్నారట. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్ సూర్య 47ను నిర్మించే ఛాన్స్ వుంది.మ్యూజిక్ డైరెక్టర్ గా సుషిన్  శ్యామ్ ను తీసుకోనున్నారు. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.