మహాకాళి నుండి అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్

Team Mahakali Introduced Akshaye Khanna as Asura Guru Shukracharya

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో తొలి చిత్రం హనుమాన్ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ యూనివర్స్ లో నెక్స్ట్ ఇంస్టాల్మెంట్ మహాకాళి. దీనిని RKD స్టూడియోస్‌ బ్యానర్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు. RK దుగ్గల్ సమర్పిస్తున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షోరన్నర్‌గా వ్యవహరిస్తుండగా, పూజ అపర్ణ కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్‌బస్టర్ ‘ఛావా’లో ఔరంగజేబు పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా మహాకాళిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఆయనకి తెలుగులో తొలి చిత్రం. ఛావా విజయం తర్వాత ఆఫర్లు వెల్లువెత్తినప్పటికీ, కథ బలం, అతని పాత్ర డెప్త్ ద్వారా అక్షయ్ తన తెలుగు రిలీజ్ కోసం మహాకాళిని ఎంచుకున్నారు.

ఈ నేపథ్యంలో అక్షయ్ పాత్రను పరిచయం చేస్తూ, సినిమాలోని అతని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హిందూ పురాణాలలో అసురుల గురువు శుక్రాచార్యుడుగా ఒక భారీ పర్వత కోట ముందు నిలబడి ఉన్నట్లు ప్రజెంట్ చేసిన లుక్ అదిరిపోయింది. తపోవ్రత వస్త్రాలు, చీకటినీ చీల్చే కాంతివంతమైన కళ్ళతో శుక్రాచార్యుడి రూపం అద్భుతంగా దర్శనమిస్తుంది.

అయితే, శుక్రాచార్యుడు కేవలం ఋషి మాత్రమే కాదు, జ్ఞానం, విరోధం, విశ్వాధికారానికి ప్రతీకగా సజీవ చిహ్నంగా చూపించారు. సనాతన విద్యకు ఆచార్యుడు, మరణించిన వారిని బతికించగల మృత-సంజీవని మంత్రం రహస్యం తెలిసిన శుక్రాచార్యుడు అసురుల ఆధ్యాత్మిక మార్గదర్శకుడు మాత్రమే కాదు, అపారమైన వ్యూహకర్త కూడా.

దేవతలూ – దానవులూ ఇద్దరి భవితవ్యాన్ని మలిచిన మహర్షిగా, ఆయనను చిత్రంలో అద్భుతమైన పాత్ర చూపించబోతున్నారు. ఇక ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందించగా, సినిమాటోగ్రఫీని సురేష్ రగుతు నిర్వహిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి వ్యవహరిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది.

‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి వస్తున్న ఈ మరో వైవిధ్యమైన చిత్రంపై టాలీవుడ్ లోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. పౌరాణిక అంశాలతో, అద్భుతమైన విజువల్స్‌తో రానున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం షూట్ పూర్తి కాగా, డిసెంబర్ నాటికి మొత్తం ప్రొడక్షన్ పూర్తి చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ కొనసాగుతున్నాయి. విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.