బాలీవుడ్ స్టార్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన సినిమా ‘థామా’. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ప్రెస్ మీట్లో హీరో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మాడాక్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో భాగమవడం చాలా ఆనందంగా ఉంది. మాడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్సిటీలో వస్తున్న నెక్స్ట్ చాప్టర్ థామా. ‘బేతాళ్’కి హెడ్ థామా. రష్మిక గారితో ఫస్ట్ టైం కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. రష్మిక బ్రిలియంట్ పెర్ఫార్మర్. ఫస్ట్ టైం హైదరాబాద్ ఫిలిం ప్రమోషన్ కోసం వచ్చాను. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడకి రావడం చాలా ఆనందంగా అనిపించింది.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమాని తమిళనాడు, ఊటీలో కూడా షూట్ చేసాము. ఇది ఫుల్ పాన్ ఇండియా ఫిలిం. నేను ప్రతి సినిమాకి ఒక కొత్త కాన్సెప్ట్ ఉండేలాచూస్తుంటాను. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఆడియన్స్‌ని అలరిస్తుంది. ఫస్ట్ టైం ఇంత యాక్షన్ చేశాను. ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకు చాలా కొత్తగా అనిపించింది. అందరూ 21 అక్టోబర్ నా థియేటర్స్‌కి వచ్చి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























