దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు భారీ నష్టాన్ని కలిగిస్తున్న అతిపెద్ద సినిమా పైరసీ ముఠా గుట్టును రట్టు చేశారు మన తెలంగాణ పోలీసులు. ఈ మేరకు తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు విస్తృత దర్యాప్తు తర్వాత ఈ ముఠాకు చెందిన ఆరుగురు కీలక సభ్యులను అరెస్ట్ చేశారు. తద్వారా తెలుగుతో సహా పలు భాషలు సినిమాలు పైరసీ చేస్తున్న వారి కార్యకలాపాలను అడ్డుకున్నారు. కాగా, ఈ ముఠా దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం కలిగించినట్టు అంచనా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్రాండ్ ఆపరేషన్.. తెలంగాణలో ఆరుగురి అరెస్ట్!
సినిమా పరిశ్రమ నుంచి అందిన ఫిర్యాదులు, సాంకేతిక ఆధారాల మేరకు పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఈ పైరసీ ముఠా కేవలం తెలంగాణకే కాకుండా, దేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించిన కొత్త సినిమాలను, ముఖ్యంగా పెద్ద బడ్జెట్ సినిమాలను విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్డీ క్వాలిటీలో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు.
అరెస్టులు, స్వాధీనం:
అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులు కూడా ఈ పైరసీ నెట్వర్క్లో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి పైరసీకి ఉపయోగించిన భారీ మొత్తంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, సర్వర్లు, మొబైల్ ఫోన్లు మరియు అప్లోడింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఆర్థిక లావాదేవీలపై కూడా పోలీసులు దృష్టి సారించారు.
సినీ పరిశ్రమకు ఊరట:
ఈ పైరసీ ముఠా కార్యకలాపాల వల్ల ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది. తాజాగా, తెలంగాణ పోలీసులు తీసుకున్న ఈ కఠిన చర్యలపై సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. నిర్మాతలకు, పంపిణీదారులకు ఈ అరెస్టులు కొంతవరకు ఊరటనిచ్చాయి. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పైరసీని అరికట్టడానికి నిరంతరం నిఘా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























