టొవినో థామస్ తో లోక చాప్టర్ 2

Makers Officially Announce Lokah Chapter 2

సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ తో మలయాళంలో తెరకెక్కిన లోకః చాప్టర్ 1 – చంద్ర గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగించి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది.విడుదలయ్యి నెల రోజులు అవుతున్న ఇప్పటికీ కేరళ లో ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది. నిన్నటి వరకు అక్కడ 106 కోట్ల వసూళ్లను రాబట్టి ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 280 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఈసినిమా తెలుగులో కొత్త లోకగా విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక లోక చాప్టర్ 2 కూడా రానుంది. అందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో ను ఈరోజు రిలీజ్ చేశారు. లోక చాప్టర్ 1 లో కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించగా చాప్టర్ 2 మలయాళ హీరో టొవినో థామస్ లీడ్ రోల్ లో రానుంది.లోక 30కోట్ల బడ్జెట్ తో రూపొందగా లోక 2 రెట్టింపు బడ్జెట్ తో రానుంది.

డొమినిక్ అరుణ్ ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించనున్నాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ చాప్టర్ 2 ను కూడా నిర్మించనున్నాడు. త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక లోక చాప్టర్ 1 దీపావళి తరువాతే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.