కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ నటిస్తున్న 35వ చిత్రం “మకుటం”. విశాల్ సరసన అంజలి కథానాయికగా నటిస్తుండగా.. దుషారా విజయన్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా రవి అరసు పనిచేస్తుండగా, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతంఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా చెన్నైలోని TR గార్డెన్లో కోట్ల రూపాయల విలువైన సెట్‌ను ప్రత్యేకంగా నిర్మించారు. ఈ సెట్లోనే కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు డాన్స్ నంబర్స్ కూడా తెరకెక్కిస్తున్నారు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రంలో తొలిసారి స్టంట్ మాస్టర్ ధిలీప్ సుబ్బరాయన్ మరియు కొరియోగ్రాఫర్ దినేష్ కలిసి హాలీవుడ్ స్టంట్ ఆర్టిస్టులతో కలసి యాక్షన్-డాన్స్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవలే సినిమా యూనిట్‌ను ఆశీర్వదించేందుకు సీనియర్ నటుడు, దర్శకుడు టీ. రాజేందర్ సెట్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విశాల్ మరియు మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మకుటం టీమ్ హర్షం వ్యక్తం చేసింది. కాగా, టీ. రాజేందర్.. స్టార్ హీరో శింబు తండ్రి అన్న విషయం తెలిసిందే.
ఇక ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. భారీ యాక్షన్, స్టైలిష్ సాంగ్స్, ఎమోషనల్ డ్రామాతో మకుటం విశాల్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో నెలకొంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని కీలక వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























