‘సరస్వతి’తో డైరెక్టర్‌గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్

Actress Varalaxmi Sarathkumar Turns Director With Saraswathi

ప్రతిభావంతురాలైన కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో కొత్త అడుగు వేసింది. తొలిసారి దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఆమె తెరకెక్కిస్తున్న చిత్రం “సరస్వతి”. ‘దోశ డైరీస్’ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే, తొలిసారి దర్శకురాలిగా వస్తున్న వరలక్ష్మి ఈ కథను ఎంత ప్యాషన్‌తో తెరకెక్కిస్తున్నారో పోస్టర్‌నే చెప్పేస్తోంది. శక్తివంతమైన కథ, శక్తివంతమైన నటీనటులు, అద్భుతమైన టెక్నికల్ టీమ్‌తో సరస్వతి ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఫిల్మ్ సర్కిల్స్‌లో వ్యక్తమవుతోంది.

కాగా, ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటులు మరియు పనిచేస్తున్న సాంకేతిక నిపుణులను ఈ పోస్టర్‌లో రివీల్ చేశారు. ఈ పోస్టర్‌తోనే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో వరలక్ష్మితో పాటు ప్రఖ్యాత నటుడు ప్రకాశ్ రాజ్, నేషనల్ అవార్డు విన్నింగ్ నటి ప్రియామణి, టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అలాగే ఈ చిత్రానికి యువతరానికి ఎనర్జీ ఇస్తున్న ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా, కెమెరా వర్క్‌ని ఏ.ఎం. ఎడ్విన్ సాకే నిర్వహిస్తున్నారు. ఇంకా ఎడిటింగ్ బాధ్యతలు వెంకట్ రాజెన్, ఆర్ట్ డిజైన్‌ను సుధీర్ మాచర్ల చూసుకుంటున్నారు. ఈ సినిమాను వరలక్ష్మి శరత్ కుమార్ మరియు ఆమె సోదరి పూజా శరత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.