సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఒక శుభవార్త! తన తదుపరి చిత్రం ప్రముఖ నటుడు, మిత్రుడు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో ఉంటుందని రజనీకాంత్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన తాజా చిత్రం జైలర్ 2 షూటింగ్ కోసం పాలక్కాడ్ బయలుదేరే ముందు మీడియాతో తెలిపారు. కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు కొనసాగుతున్న నేపథ్యంలో రజనీకాంత్ ఈ విషయాన్ని ధృవీకరించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో..
ఇక ఈ ప్రాజెక్ట్‌కు క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. లోకేష్ గతంలో కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసి తన సత్తా చాటారు. అలాగే ఇటీవలే రజినీతో ‘కూలీ’ తీసి ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు, ఇద్దరు లెజెండరీ నటులు రజనీకాంత్ మరియు కమల్ హాసన్ లతో కలిసి పనిచేయనుండటం సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. అయితే ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమా? కాదా? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇంతకుముందు లోకేష్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ ఫిలిమ్స్ ‘ఖైదీ, విక్రమ్, లియో’ సినిమాలు LCUలోనివే.
రజనీ-కమల్ కాంబినేషన్.. అభిమానులకు పండుగే!
ఇదిలావుంటే, దాదాపు మూడు దశాబ్దాల క్రితం రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి నటించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే ప్రాజెక్ట్‌లో భాగం కావడం అనేది ఒక అరుదైన, చారిత్రాత్మక సంఘటన. రజనీకాంత్ నటుడిగా, కమల్ హాసన్ నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడం వారి మధ్య ఉన్న స్నేహానికి, పరస్పర గౌరవానికి నిదర్శనం. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి కీలక వివరాలు వెల్లడికానున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























