ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా.ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూటింగ్ కొనసాగుతుంది.ఈనెలతో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఇక ఈసినిమా నుండి విడుదలైన ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే చార్ట్ బస్టర్ అనిపించుకుంది.రామ్ స్వయంగా ఆ పాటను రచించగా అనిరుధ్ వోకల్స్ అందించాడు.ఇప్పటికీ ఈసాంగ్ మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆంధ్ర కింగ్ తాలూకా నుండి నెక్స్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.ఫుల్ ఫన్ సాంగ్ గా రానుంది. పప్పీ షేమ్ అంటూ సాగే ఈసాంగ్ సెప్టెంబర్ 8న విడుదలకానుంది.మహేష్ బాబు.పి డైరెక్షన్ లో హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో నటిస్తుండగా తనకు వీరాభిమానిగా సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నాడు.ఇందులో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.నవంబర్ 28న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక ఈసినిమాతో రామ్ సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.సినిమా కూడా బాగా వస్తుందని టాక్. సో రామ్ కు హిట్ కొట్టడానికి ఇంత కన్నా మంచి ఛాన్స్ దొరకదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























