బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ అలరించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. సెప్టెంబర్ 12న విడుదల కానుండగా, ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ అయితే కిష్కింధపురిపై అంచనాలని మరింతగా పెంచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. సాహు గారికి ఈ కథ చెప్పగానే సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చెప్పారు. అలాగే సాయి గారికి కథ చెప్పిన వెంటనే నచ్చింది. సాయి గారు అనుపమ గారు కలిసి చేసిన ‘రాక్షసుడు’ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా మీ అంచనాలకు మించి ఉంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నాకు సపోర్ట్ చేసిన మా టెక్నికల్ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాలో ఫెంటాస్టిక్ విజువల్స్ ఉంటాయి. చైతన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. టెక్నికల్‌గా సినిమా చాలా ఉన్నతంగా ఉంటుంది. మమ్మల్ని బిలీవ్ చేసిన నిర్మాత సాహు గారికి థాంక్ యూ. సెప్టెంబర్ 12న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్‌లో చూడండి. కచ్చితంగా మీకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























