మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మలయాళ మూవీ లోకః చాప్టర్ 1 – చంద్ర బాక్సాఫీస్ వద్ద కలెక్టన్ల వర్షం కురుపిస్తుంది. మొదటి నాలుగు రోజులు సాలిడ్ వసూళ్లతో హవా కొనసాగించగా నిన్న వర్కింగ్ డే లో కూడా 14కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టుకొని అదరగొట్టింది. దాంతో కేరళ లో 5 రోజుల్లో ఈసినిమా 22 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకోగా ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.రేపటి తో 100కోట్ల క్లబ్ లో చేరనుంది. అంతేకాదు అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించనుంది. ఓవరాల్ గా 100 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన 12వ మళయాళ సినిమాగా లోకః రికార్డుల్లోకెక్కనుంది.ఫుల్ రన్ లో ఈజీగా ఈసినిమా 150 కోట్ల మార్క్ ను దాటనుంది.
ఇక ఈసినిమా తెలుగులో కొత్త లోక గా విడుదలై సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.మౌత్ టాక్ కి తోడు రివ్యూస్ పాజిటివ్ గా రావడంతో తెలుగులో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ముఖ్యంగా మల్టీ ఫ్లెక్స్ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాడు.
యువ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించగా సూపర్ హీరో కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ ఈసినిమాను తెరకెక్కించాడు. ఇందులో ప్రేమలు ఫేమ్ నస్లేన్ , శాండీ కీలక పాత్రల్లో నటించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఈసినిమాను నిర్మించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























