రీసెంట్ గా భైరవంతో వచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ సోలో హీరోగా కిష్కింధపురితో రానున్నాడు.హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి ఈసినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కొంచెం డిఫ్రెంట్ గా చేస్తుంది కిష్కింధపురి టీం.కేవలం ప్రమోషన్స్ కోసమే ఓ సెట్ వేశారు. ఆ సెట్ చూస్తుంటేనే ఒక రకమైన భయం కలిగేలా వుంది. సినిమా థీమ్ కు తగ్గట్లు ఈ సెట్ ను వేశారు. ఇందులోనే కిష్కింధపురి టీం ఇంటర్వ్యూలు ఇవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇంతకుముందు సెప్టెంబర్ 12న రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే నిన్న ఆ డేట్ మార్చి 13న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.ఎలాంటి వాయిదా లేకుండా సెప్టెంబర్ 12నే రిలీజ్ కానుందని ట్రైలర్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ప్రకటించారు.సో ఈనెల 12న కిష్కింధపురిథియేటర్లలోకి రానుంది. ఇకట్రైలర్ ను రేపు ఉదయం 11:07 గంటలకు రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్ వచ్చాక సినిమాపై అంచనాలు పెరగనున్నాయి.
సామ్ సీఎస్ ,చైతన్య భరద్వాజ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇక సాలిడ్ హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సాయి శ్రీనివాస్ కిష్కింధపురితో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























