సినీ ప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘కిష్కింధపురి’ ట్రైలర్ రానే వచ్చింది. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ హర్రర్-మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా కిష్కింధపురి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ హైలైట్స్
‘కిష్కింధపురి’ ట్రైలర్ ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాలు, మరియు అద్భుతమైన విజువల్స్‌తో నిండి ఉంది. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాను చాలా స్టైలిష్‌గా, మరియు హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక కొత్త పాత్రలో కనిపించారు. యాక్షన్ సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పించాయి. అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటన కూడా ఆకట్టుకునేలా ఉంది.
ఇంకా ట్రైలర్ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసేలా ఉంది. మొత్తానికి పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో ట్రైలర్ అయితే చిత్రంపై అంచనాలను పెంచేసింది. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వచ్చిన ‘రాక్షసుడు’ సినిమా విజయాన్ని మించిపోతుందని మూవీ లవర్స్ భావిస్తున్నారు.
కాగా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలలో ‘రాక్షసుడు’ తర్వాత ఇంతటి హైప్ క్రియేట్ చేసిన సినిమా ఇదే. దీంతో కిష్కింధపురి బెల్లంకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























