గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని కలిశారు. ఈ ఆయన బెంగళూరులోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రామ్ చరణ్‌ను అభినందించి, ఆయన భవిష్యత్ ప్రాజెక్టులకు శుభాకాంక్షలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘పెద్ది’ గురించి ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. ‘పెద్ది’ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని, ఆయన సినిమాకు ఒక ప్రత్యేక బలాన్ని చేకూర్చారని రామ్ చరణ్ ముఖ్యమంత్రికి తెలిపారు.
సీఎంను కలిసిన అనంతరం దీనిపై రామ్ చరణ్ ఎక్స్ వేదికగా.. “గౌరవనీయులైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారూ, ధన్యవాదాలు. కర్ణాటకలో షూటింగ్ చేయడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది మరియు మీ హృదయపూర్వక ఆతిథ్యాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది.” అని తెలిపారు.
కాగా ఈ సమావేశం రామ్ చరణ్ యొక్క పాన్-ఇండియా అప్పీల్‌ను మరింత పెంచింది. రాజకీయ ప్రముఖులు మరియు సినీ ప్రముఖులు ఒకరినొకరు కలుసుకోవడం, సినీ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడటం మంచి పరిణామం అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























