అల్లు కనకరత్నమ్మకు సినీ ప్రముఖుల ఘన నివాళులు

Tollywood Celebs Pay Respect to Allu Aravind's Mother, Kanakaratnamma

దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ మాతృమూర్తి కనకరత్నమ్మ కన్నుమూసిన విషయం తెలిసిందే. వృధ్ధాప్యకారణాల వలన శుక్రవారం అర్థరాత్రి దాటాక 94 సంవత్సరాల వయస్సులో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు వారి ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అల్లు వారి అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే సినిమా షూటింగ్‌ల నిమిత్తం ఇతర రాష్ట్రాలలో ఉన్న అల్లు అర్జున్, రామ్ చరణ్‌ హుటాహుటిన వాటిని క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గతేజ్ సహా ఇతర కుటుంబసభ్యులు కూడా ఆమెకు అంజలి ఘటించారు. ఇక వీరితోపాటుగా అనేకమంది సినీ ప్రముఖులు అల్లు అరవింద్ నివాసంలో కనకరత్నమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.