మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ ఈనెల 14న విడుదలై రివ్యూస్ తో సంబంధం లేకుండా మొదటి రోజే 151 కోట్ల గ్రాస్ వసూళ్లతో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.ఇక ఆ తరువాత కూడా అదే జోరు కొనసాగిస్తూ నిన్నటి తో మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వేరే సినిమాలతో పోటీ లేకపోవడంతో ఇప్పటికీ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్రేక్ ఈవెన్ వైపు అడుగులువేస్తోంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
రజినీకాంత్ ఈ ఫీట్ సాధించడం ఇది మూడో సారి.ఇంతకుముందు 2.0, జైలర్ తో రెండు సార్లు ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా తమిళనాడు లో కూలీ సెన్సేషనల్ వసూళ్ళతో దూసుకుపోతుంది.అయితే మరో 100 కోట్ల రాబడితే కానీ టార్గెట్ ను చేరుకోదు.మరి ఫుల్ రన్ లో ఆ టార్గెట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.
లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈసినిమాలో నాగార్జున విలన్‌గా నటించగా సౌబిన్ షాహిర్ ,ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరిశాడు.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మించింది.విడుదలకు ముందు ఈసినిమాకు ఓ రేంజ్ హైప్ వచ్చింది.థియేట్రికల్ రన్ తరువాత కూలీ అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























