యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన కొత్త చిత్రం ‘డ్యూడ్’ నుంచి మొదటి పాట విడుదలైంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ఈ చిత్రం నుండి నిన్న ఫస్ట్ సింగిల్‌ను ఫస్ట్ గేర్ పేరుతో విడుదల చేసారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘బూమ్ బూమ్’ అంటూ సాగే ఈ పాట మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో 2.5 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఈ ఫస్ట్ గేర్ దూసుకుపోతోంది. తద్వారా ప్రస్తుతం ఇది నంబర్.1 ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ఈ సాంగ్‌కి వస్తున్న స్పందన చూస్తుంటే, సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని చెప్పొచ్చు.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ప్రదీప్ రంగనాథన్ సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























