లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి మరియు నటుడు గోపీచంద్ జంటగా నటించిన హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘాటి’ విడుదలకు సిద్ధమైంది. మరో 7 రోజుల్లో, అంటే సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం భారీ అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డ్రీమ్ Z ఎంటర్టైన్మెంట్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ మూవీని యూకేలో రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో అక్కడ స్పెషల్ ప్రీమియర్స్ వేయడానికి మేకర్స్ నిర్ణయించారు. దీనిలో భాగంగా ఒకరోజు ముందు, అనగా.. సెప్టెంబర్ 4న యూకేలోని ప్రేక్షకుల కోసం చిత్ర బృందం ప్రత్యేక ప్రీమియర్ షోలు ఏర్పాటుచేస్తోంది. ఈ మేరకు దీనికి సంబంధించి టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.
కాగా అనుష్క శెట్టి ఒక కొత్త అవతార్ లో కనిపించనున్న ఈ సినిమా ఒక థ్రిల్లర్, యాక్షన్ డ్రామా. గోపీచంద్, అనుష్క శెట్టి, జగపతిబాబు వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























