ఘాటి సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ

Anushka Shetty's Ghaati Gets UA Certification, All Set For Release

ఈ ఏడాది సినిమా ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘ఘాటి’ ఒకటి. క్వీన్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు జంటగా తెరకెక్కిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ అందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఘాటి సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీచేసింది. కాగా ఈ సినిమా 2 గంటల 35 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రేక్షకులను రెండు గంటలకు పైగా సీట్లకు అతుక్కుపోయేలా చేయాలంటే, స్క్రీన్‌ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉండాలి. ఈ విషయంలో చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉందని చెప్పవచ్చు.

ఇక ఇందులో కట్టిపడేసే కథనం, అద్భుతమైన భావోద్వేగాలు, మరియు ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. అనుష్క పాత్ర, కథలోని గాఢత, భావోద్వేగాల ప్రయాణం.. ఇలా ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో చూపించనున్నట్టు స్పష్టం చేసింది.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ సమర్పణలో ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, అంచనాలు మరింత పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.