కింగ్ నాగార్జున బర్త్‌ డే.. 66 ఏళ్ల మ‌న్మ‌థుడి నట ప్రస్థానం!

King Nagarjuna Birthday The Remarkable Journey of Ageless Superstar

టాలీవుడ్‌లో కొత్త ఒరవడిని సృష్టించిన ‘కింగ్’ నాగార్జున పుట్టినరోజు ఈరోజు. టాలీవుడ్ తొలితరం అగ్రహీరో అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున, దాదాపు నాలుగు దశాబ్దాలుగా తండ్రి ఘన వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. తన నటన, వ్యక్తిత్వం, అందం, సింప్లిసిటీ, స్టైల్, అన్నింటి కలయికగా తెలుగు సినిమా చరిత్రలో ‘కింగ్’గా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ హీరో, నేటికీ అదే యవ్వనంతో, అదే ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తనదైన స్టైల్, గ్రేస్‌తో ప్రేక్షకులను మెప్పించిన అరుదైన నటుడు నాగార్జున. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా తన అందం, ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ వస్తున్న ఈ ‘మన్మథుడు’ సినీ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకం. ‘టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో’గా గుర్తింపు పొందిన ఆయన లుక్స్ చూస్తే, యంగ్ హీరోలు సైతం ఇన్స్పైర్ అవుతారు. “ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్” అన్నది నాగార్జున లైఫ్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్. నేడు నాగ్ జన్మదినం సందర్భంగా ఆయనపై స్పెషల్ స్టోరీ..

సినీరంగ ప్రవేశం – స్టార్ హీరో వారసుడి తొలి అడుగులు

1986లో ‘విక్రమ్’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన నాగార్జున, తన తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘మజ్ను’ వంటి చిత్రాలతో ప్రేమ కథా నాయకుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే, ఆయన కెరీర్‌కు అసలైన టర్నింగ్ పాయింట్‌లు ‘గీతాంజలి’ మరియు ‘శివ’ సినిమాలు అని చెప్పాలి.

మణిరత్నం దర్శకత్వంలో 1989లో వచ్చిన ‘గీతాంజలి’తో ఒక కొత్త ప్రేమకథను పరిచయం చేస్తే, 1990లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’తో యాక్షన్ హీరోగా కొత్త ఒరవడిని సృష్టించారు. ఈ రెండు సినిమాలు నాగార్జునను ఒక కొత్త స్టార్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా శివ సినిమాలో కాలేజీలో గొడవ సమయంలో సైకిల్ చైన్ తెంపి చేతికి చుట్టుకునే సీన్ అయితే సంచలనం సృష్టించింది. అయితే నాగార్జున కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాలేదు. తన తండ్రివలే అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేసి మెప్పించారు. తండ్రితో కలసి మొదటిసారిగా ‘కలెక్టర్ గారి అబ్బాయి’ చిత్రంలో నటించారు.

నటనలో కొత్త ప్రయోగాలు..

‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’, ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి భక్తి రస చిత్రాలతో నటుడిగా తన లోతైన నైపుణ్యాన్ని చూపించారు. అలాగే, ‘ప్రెసిడెంటు గారి పెళ్ళాం, వారసుడు, హలో బ్రదర్, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, నిన్నే ప్రేమిస్తా, మ‌న్మ‌థుడు’ వంటి కుటుంబ కథా చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇంకా ‘అంతం, కిల్లర్, క్రిమినల్’ వంటి సినిమాలలో తన నటనతో మెప్పించారు. ఇలా ప్రతి జానర్‌లోనూ హిట్‌లు ఇచ్చి, అన్ని వర్గాల ఆడియన్స్‌ని అలరించారు.

కుటుంబం, వారసత్వం..

నాగార్జున వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే, సతీమణి అమల కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ కావడం గమనార్హం. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. నాగ చైతన్య మరియు అఖిల్. నాగార్జున తన ఇద్దరు కుమారులను కూడా సినీ ప్రయాణంలో ప్రోత్సహిస్తున్నారు. వీరిద్దరూ కూడా తండ్రి బాటలో నటులుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా నాగ్ తర్వాత నాగచైతన్య ‘అక్కినేని’ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు.

అన్నపూర్ణ స్టూడియోస్ & ఫిల్మ్ స్కూల్

సినిమా నిర్మాణంలో తన తండ్రి అడుగుజాడలను అనుసరిస్తూ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌ను విస్తరించారు. ఈ క్రమంలో ఎన్నో చిత్రాలను స్వయంగా నిర్మించారు. అంతేకాకుండా, సినీ రంగానికి అవసరమైన నటీనటులను, సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను స్థాపించారు. ఈ సంస్థ దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు గల ఫిల్మ్ స్కూల్‌గా గుర్తింపు పొందింది.

బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా సరికొత్త ఒరవడి

అయితే నాగార్జున కేవలం నటుడిగానే కాకుండా యాంకర్ గా ఒక టెలివిజన్ షోను నడిపించడం విశేషం. బిగ్‌బాస్ తెలుగు షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు సీజన్లను విజయవంతంగా నడిపించి, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. నాగార్జున గ్రేస్, స్టైల్ మరియు ఆయన పలికే పంచ్ డైలాగ్స్ ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆయన హోస్టింగ్‌తో ఈ షోకు టీఆర్పీ రేటింగ్‌లు భారీగా పెరిగాయి. నాగార్జున తన చమత్కారంతో, కంటెస్టెంట్స్‌ను నడిపించే తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది.

‘కూలీ’ తో తొలిసారి విలన్‌గా… మైల్ స్టోన్ 100వ సినిమా త్వరలో

కాగా, ఇటీవలే రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కూలీ’ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఇందులో తొలిసారిగా ఆయన ప్రతినాయక ఛాయలున్న ‘సైమన్’ పాత్రలో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇది నాగార్జున నటించిన 99వ చిత్రం. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లో మైలురాయిగా నిలవనున్న 100వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు ‘రా’ కార్తీక్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.

పురస్కారాలు & గుర్తింపు

నాగార్జున తన సినీ ప్రయాణంలో రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది పురస్కారాలు, మూడు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు సహా మరెన్నో అవార్డులను గెలుచుకున్నారు. ఇంకా భరతముని, వంశీ బర్కిలీ, ఏపీ సినీ గోయర్స్, టీ. సుబ్బరామిరెడ్డి కళారత్న వంటి ఇతర పురస్కారాలు ఎన్నింటినో నాగ్ అందుకున్నారు. ఇది ఆయన నటనకు, నిర్మాతగా ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం.

37 ఏళ్లకు పైగా కెరీర్ సాగించినా, నాగార్జున యూత్‌కి ఇన్స్పిరేషన్‌గా, ఫ్యాన్స్‌కి హార్ట్‌బీట్‌గా నిలిచారు. ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే – “కింగ్ ఈజ్ ఎవర్గ్రీన్.. కింగ్ ఈజ్ ఫరెవర్!”. ఇక ఈ పుట్టినరోజు సందర్భంగా నాగార్జునకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే పలువురు నెటిజన్లు కూడా ఈ నవ మన్మథుడికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇలాంటి పుట్టినరోజులు నాగార్జున మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. వన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే కింగ్ నాగార్జున.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.