బబుల్ గమ్ తరువాత యూత్‌ఫుల్ హీరో రోషన్ కనకాల నటిస్తున్న తాజా చిత్రం మోగ్లీ 2025. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విజేత దర్శకుడు సందీప్ రాజ్ రూపొందిస్తున్నారు.యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి టీజర్ రానుంది.ది వరల్డ్ ఆఫ్ మౌగ్లీ పేరుతో ఈనెల 28న ఈ వీడియో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈచిత్రంతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా ఆరంగేట్రం చేస్తుండగా కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. బండి సరోజ్ కుమార్ ఇందులో విలన్ పాత్రలో కనిపించనునున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.ఈసినిమాను ఈఏడాది చివర్లో విడుదలచేయనున్నారు.
ఈ చిత్రానికి రామమారుతి ఎం సినిమాటోగ్రఫీ ని అందిస్తుండగా కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.కిరణ్ మామిడి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తుండగా, నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రాఫర్ చేస్తున్నారు.ప్రతిభావంతులైన తారాగణం,టెక్నికల్ టీంతో రూపొందుతున్న మోగ్లీ 2025 సినీ ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























