మూడేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది కన్నడ సినిమా కాంతార.ఒక్క కన్నడ లోనే కాదు తెలుగు ,హిందీ భాషల్లో కూడా ఈసినిమా ఊహించని కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఇక ఈసినిమాకి సీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 వస్తుంది.దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో గ్రాండియర్ గా తెరకెక్కుతుంది.ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రైట్స్ కి మేకర్స్ ఊహించని విధంగా కోట్ చేస్తున్నారు. 80 నుండి 90 కోట్ల వరకు చెప్తున్నారట.అంటే దాదాపు 100కోట్ల వరకు వెళ్తున్నారు. కాంతార ఫస్ట్ పార్ట్ తెలుగులో 30 కోట్లకు పైనే కలెక్ట్ చేసింది. ఆ నమ్మకంతో మేకర్స్ చాలా ఎక్కువ మొత్తంలో కోట్ చేస్తున్నారు.
సినిమాకి ఎంత హైప్ వున్నా ఈ రేంజ్ ప్రైస్ కి తెలుగు నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తారా.ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎవరు ఈ రైట్స్ ను దక్కించుకుంటారో చూడాలి.అజనీష్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా టాప్ బ్యానర్ హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 2 ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























